ప్రజాశక్తి- యు. కొత్తపల్లి : మద్యం షాపుల్లో ఐదేళ్లపాటు పనిచేసిన ఔట్సోర్సింగ్ కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు దిగారు పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా… కనీసం ఉద్యోగ బాధ్యత లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తమను ప్రభుత్వం ఇంటికి పంపే మార్గం చూపడం అన్యాయమైన విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈనెల 12 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం షాపులను తెరవనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా మద్యం షాప్ లో పనిచేసిన కార్మికులు ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం సమ్మెలో దిగారు. ప్రభుత్వ మాత్రం ఈనెల ఆరో తేదీ వరకు షాపుల్లో పనిచేయాలని కార్మికులను కోరడం, కార్మికులు మాత్రం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడంతోపాటు, తమకు వైన్ షాపులో పనిచేసే అవకాశం కల్పించాలని కోరడం కూడా జరిగింది ప్రైవేట్ మద్యం షాపులు వస్తే… తమ బతుకులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు… ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు అవస్థలు పడుతున్నారు…
బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం అమ్మకాలు..
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేస్తారని మద్యం ప్రియులకు తెలిసిన విషయమే. అయితే ఔట్సోర్సింగ్ కార్మికులు మంగళవారం నిరసన చేయడం తో ఒకరోజు ముందుగా, అంటే రెండు రోజులు వరుసగా మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుంది.ఇదే అదునుగా బెల్టు షాపు నిర్వాహకులు ముందుగా మద్యాన్ని నిల్వ చేసుకొని మద్యం ప్రియులకు అధిక రేట్లకు అమ్ముతున్నారు..