అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి

గుంటూరు : రైలు పట్టాలపై యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం గుంటూరులో జరిగింది.
ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని మూడు బావుల సెంటర్‌ (బరంపేట నివాసి)కు చెందిన షేక్‌.పెద్ద ఖాసిం గత ఐదు ఏళ్లుగా నరసరావుపేట నుండి కడపకు వెళ్లిపోయి టీ కొట్టు పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి కడప నుండి నరసరావుపేటకు నిన్న గుంటూరుకు వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తురక పొలంలోని తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఉదయానికి రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. అయితే నిన్న రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా, ఒకసారిగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిందని వారి బంధువులు తెలిపారు. రెండవ పట్టణ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. యువకుడిది హత్యా, ఆత్మహత్యా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️