యువత పోరును జయప్రదం చేయాలి

ప్రజాశక్తి-శింగరాయకొండ: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు కూటమి ప్రభు త్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటామని వైసీపీ కొం డేపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంగళవారం శింగరాయకొండలోని క్యాంపు కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. ఒంగోలులో జరిగే కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షు లు ఎస్కే సుల్తాన్‌, రాష్ట్ర నాయకులు బొట్ల రామారావు, పుట్ట వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పొన్నలూరు జడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు, శింగరాయకొండ ఎంపీపీ కట్టా శోభా రాణి, చుక్కా కిరణ్‌ కుమార్‌, ఎస్కే సలీం, ఎస్కే కరీం, యనమల మాధవి, రాపూరి ప్రభావతి పాల్గొన్నారు.

➡️