పూలపల్లిలో దొంగతనం

Aug 6,2024 16:06 #Pulapally, #theft

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లుకు సమీపంలోని పూలపల్లిలో సోమవారం సాయంత్రం దొంగతనం జరిగి 15 కాసుల బంగారం, వెండి వస్తువులు దొంగిలించారు. పూలపల్లి పంచాయతీ ఆఫీస్‌ కు సమీపంలోనే బక్క శ్రీనివాస్‌ రావు ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. శ్రీనివాసరావు భార్య కఅష్ణవేణి ఇద్దరు పిల్లలను సాయంత్రం 6 గంటలకు అక్కడ సమీపంలోని ట్యూషన్‌ కు తీసుకెళ్ళు 7:30 కు ఇంటికి వచ్చింది తలుపు తీయగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం గమనించి బీరువా పరిశీలిస్తే బీరువాలోని 18 కాసుల బంగారం, కిలో వెండి వస్తువులు దొంగిలించారు. వెంటనే లబోదిబోమని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి సమీపంలోని సిసి కెమెరా లు పరిశీలిస్తున్నారు.

➡️