బొల్లాపల్లి (అనంతపురం) : బొల్లాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. మారుమూల ప్రాంతమైన బొల్లాపల్లి మండలంలో ప్రజలు వైద్య నిమిత్తం, గర్భిణీలు కాన్పులకు బల్లాపల్లి పిహెచ్‌సి కి వస్తారు. హాస్పిటల్ లో ఇద్దరు వైద్యులు, సిబ్బంది ఉంటారు. శనివారం మండలంలోని అనేక గ్రామాల నుండి గర్భిణీలు, సీజనల్ జ్వరాలతో రోగులు ఆసుపత్రికి వచ్చి 9 గం నుండి 12.30 వరకు వేచి ఉండి వైద్యులు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలో రక్త పరీక్షల కేంద్రానికి కూడా తాళాలు వేసి ఉన్నారు. 8 గంటల నుండి రోగులకు అందుబాటులో ఉండాల్సింది డాక్టర్లు విధులకు రాలేదని రోగులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. బొల్లాపల్లి ప్రాథమిక వైద్యశాలలో సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని, డాక్టర్లు డ్యూటీకి రాకపోవడం, రోగులను ఇబ్బంది పెట్టడం, ప్రోటోకాల్ కూడా పాటించకుండా జగన్ ఫోటోలు ఉంచడం పై టిడిపి నాయకులు గోవిందు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.