చిలకలూరిపేటలోనే తక్కువ అవినీతి

Dec 1,2024 01:43

ప్రజాశక్తి-చిలకలూరిపేట : దేశంలోని అవినీతి అతి తక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖ చిలకలూరిపేట తపాలాశాఖేనని కేంద్రం కమ్యూనికేషన్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో రూ.2.3 కోట్లతో తపాలా కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవీటికోట అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనను రాజకీయాల్లోకి తెచ్చింది పత్తిపాటి పుల్లారావేనని చెప్పారు. ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ ఇటీవల కడప జిల్లా గండికోట అభివృద్దికి కేంద్రం నిధులు కేటాయించిన విధంగానే, కొండవీడు కోటకు కూడా నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఆర్డీవో మధులత, చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఏపీ సర్కిల్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️