ప్రజాశక్తి – వేమూరు : కూటమి ప్రభుత్వంలో మహి ళలు, బాలికలకు రక్షణ లేదని వైసిపి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు తెలిపారు. కొల్లూరు మండలం కిష్కింద పాలెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన సోషల్ ఉపాధ్యాయుడు 6,7 తరగతులు చదు వుతున్న 9 మంది బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించడం అమానుషమని వైసిపి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు తెలిపారు. బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులను బుధవారం కలిసి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ విద్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తుందన్నారు. లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగ పాలన వల్ల రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యా యుడు నెల రోజులుగా తొమ్మిది మంది విద్యార్థులను పట్ల అమానుషంగా లైంగిక వేధింపులకు పాల్పడం దుర్మార్గమని అగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులకు రెండు రోజులలో న్యాయం జరిగేవిధంగా చూడా లన్నారు. లేని పక్షంలో న్యాయం కోసం పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో భట్టిప్రోలు,కొల్లూరు మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.