వైసిపిని వీడే ప్రసక్తే లేదు!

పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

పార్టీ మార్పు వదంతులపై పాడేరు ఎమ్మెల్యే క్లారిటీ

ప్రజాశక్తి-పాడేరు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డిని, వైసిపిని వీడే ప్రసక్తేలేదని, ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటాననిపాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని ఖండించారు. సోమవారం పాడేరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఆ తర్వాత వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా, ఎస్‌టి కమిషన్‌ సభ్యుడిగా, ఇపుడుఎమ్మెల్యేగా ఎన్నోఅవకాశాలు కల్పించిన వైసిపిని వీడితే పుట్టగతులుండవని స్పష్టం చేశారు. 2029లో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందనిఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్షులు కూడా సురేష్‌, కిల్లు కోటిబాబనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిదరి మంగ్లన్న దొర, పాడేరు మండల అధ్యక్షుడు రాంబాబు,సర్పంచులు వంతాల రాంబాబు, వనుగు బసవన్న దొర, మాజీ సర్పంచులు శరభ సూర్యనారాయణ, పాంగీ సత్తిబాబు, పాడేరు పట్టణ అధ్యక్షుడు దన్నేటి పలాసి రాంబాబు ఉన్నారు.

మాట్లాడుతున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

➡️