ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు

Jun 8,2024 20:39

ప్రజాశక్తి – గజపతినగరం: ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో గజపతినగరం, దత్తిరాజేరు మండల కార్యకర్తలు, నాయకులతో ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రా యాలను ఓపిగ్గా విన్న తర్వాత కర్ణుడు చావుకి కారణాలు ఎన్నో అన్నట్లు పార్టీ ఓటమికి కారణాలు ఉన్నాయని వాటిని జగన్మోహన్‌ రెడ్డి దృష్టిలో పెడతామని అన్నారు. ఫలితాల పట్ల ఎవరూ నిరుత్సాహపడవలసిన అవసరం లేదని పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకుతో పటిష్టంగా పదిలంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యాల యంలో అందరికీ అందుబాటులో ఉంటా నని తెలియ జేశారు. కూటమి ఎమ్మెల్యే గెలిచిన కొండపల్లి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఐదు సంవత్స రాల పరిపాలనలో తనతో పాటు ప్రయాణం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పాలనలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి అందివ్వాలని ఉద్దేశంతో టెండర్లకు పిలిచామని, ఏరియా ఆసుపత్రినే వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో 80 శాతం పనులు పూర్తి చేశామని, రోడ్లను కూడా 80 శాతం పూర్తి చేసామని మిగిలిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయాలని కోరారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోకు ఆకర్షితులై ప్రజలు అధికారం ఇచ్చారని ఇప్పుడు వాటిని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు శాంతి యుతంగా పాలనందిం చామని కూటమి అధికారంలోకి రాగానే వైసిపి నాయ కులు కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో వైసిపి యువ నాయకులు బొత్స సాయిగురు నాయుడు, జెడ్‌పిటిసి గార తవుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ పాల్గొన్నారు.

➡️