ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం మండలం రాజుగారితోటకు గ్రామంలో రాపాక చంద్రరావు పై దాడి చేసి నగదు అపహరించకపోయిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం నరసాపురం డిఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ మురళీకఅష్ణ వివరాలను మీడియా కు వెల్లడించారు. దోపిడీకి స్కెచ్ వేసి గాయపరిచిన మేడిది వెంకట రెడ్డి, మాణిక్య బాబు మరో ఐదుగురుని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి రూ.1.70 లక్షల నగదు, రెండు బైక్ లు,10 కరెన్సీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.