వీరఘట్టంలో దాహం కేకలు

ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : వీరఘట్టం మండలంలోని అన్ని గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వండువ రక్షిత మంచినీటి పథకం ద్వారా నాలుగు రోజుల నుండి తాగునీరు సరఫరా కాకపోవడంతో పల్లె ప్రజలు గొంతును తడుపుకునేందుకు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి నాగావళి నదిలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మండుటేండలో అంత దూరం వెళ్లివచ్చే సరికి వడదెబ్బ బారిన పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి వండువ రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేయాల్సి కోరుతున్నారు.

➡️