ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఈ మార్పు : ఎమ్మెల్యే పల్లా

Jun 8,2024 00:15 #Gajuwak Tdp sambaralu
Gajuwaka TDP sambaralu

ప్రజాశక్తి -గాజువాక : ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ప్రజలు ఓటు ద్వారా మార్పు చూపించారని, ఇంతటి ఘన విజయాన్ని అందించారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 76వ వార్డు పరిధి బర్మాకాలనీలో వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యాన శుక్రవారం అమ్మవారి మొక్కును పల్లా శ్రీనివాసరావు చెల్లించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకమలు సమర్పించి, 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాజువాక ప్రజలు అఖండ విజయాన్ని అందించారని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తానని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షుడు బాసేట్టి అప్పారావు, తాటికొండ సుదర్శన్‌, కాతా బాలకృష్ణ, వెల్లంకి శివరాం ప్రసాద్‌, వియ్యప్ప వెంకన్న, రౌతు గోవింద్‌, ములకలపల్లి ఈశ్వరరావు, కూన వెంకటరావు, రాజా, సత్యారావు, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️