సమాజ పురోభివృద్ధిలో ”మహిళలదే” ప్రథమస్థానం : పారా సంస్థ డైరెక్టర్‌ థామస్‌ పల్లెతానం

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : నేటి సమాజంలో జాతి నిర్మాణం, సమగ్రత, సామరస్యత, శాంతి పెంపొందించడంలో మహిళలదే ప్రధమ స్థానమని ఐక్యరాజ్యసమితి మాజీ సభ్యులు, పారా సంస్థ డైరెక్టర్‌ థామస్‌ పల్లెతానం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్‌ ఆవరణలో రావులపాలెం పారా సంస్థ, ఐసిడిఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సర్పంచ్‌ నాతి లావణ్య కుమార్‌ రాజా అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు ఒక అమ్మగా జన్మనిస్తుందని, భార్యగా బాధ్యతలను మోస్తుందని, ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుందని, చెల్లిగా స్నేహాన్ని చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుందని, కూతురిగా ప్రేమను పంచుతుందని ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కర్తవ్యన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారన్నారు. కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ, స్వయం సమఅద్ధి సాధించిన సమాజం అభివఅద్ధి చెందుతుందన్నారు. అలాగే మహిళా సాధికారతయే జాతి సాధికారతని, కుటుంబానికి, సమాజానికి, దేశాభివఅద్ధికి మహిళల సేవ, త్యాగం కఅషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పారా సంస్థ కోఆర్డినేటర్‌ జి.దుర్గ, కార్యదర్శి కె.మోక్షంజలి, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ నాగలక్ష్మి, మహిళా పోలీస్‌ రత్నకుమారి, అంగన్వాడీలు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

➡️