18ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలి

Oct 29,2024 22:18

ఓటర్ల సవరణపై నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ

డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి

ప్రజాశక్తి-విజయనగరంకోట : జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని డిఆర్‌ఒ ఎస్‌. శ్రీనివాస మూర్తి తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 29న డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ పబ్లికేషన్‌ జరుగుతుందని, ఆ రోజు నుండి నవంబర్‌ 28 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని డిఆర్‌ఒ తెలిపారు. ఈ నెల రోజుల్లో ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపులు చేపడతామన్నారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా ఆన్లైన్‌ లో గానీ, పోలింగ్‌ స్టేషన్‌ వద్ద గానీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరా లను డిసెంబర్‌ 12లోగా పరిష్కరిస్తా మన్నారు. తుది ఓటర్ల జాబితా ను జనవరి 6న ప్రచురిస్తామన్నారు. మంగళవారం డిఆర్‌ఒ తన ఛాంబర్‌ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి లో నవంబర్‌ 9, 10 , 23 , 24 తేదీలల్లో ఉదయం 10నుండి సాయంత్రం 5గంటల వరకు స్పెషల్‌ కాంపెయిన్‌ నిర్వహిస్తా మన్నారు. బిఎల్‌ఒలు బూత్‌ వద్దనే ఉండి క్లెయిమ్‌లు స్వీకరిస్తారని తెలిపారు. సందేహాల కోసం ఓటర్స్‌ హెల్ప్‌ లైన్‌ 1950 నెంబర్‌కు కాల్‌చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.

➡️