అంబేడ్కర్‌ను అవమానించిన వారిని అరెస్ట్‌ చేయాలి

Jun 11,2024 15:02 #BR Ambedkar, #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ): డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఎర్ర పోతవరం లాకుల వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాలపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఆయన విగ్రహాలు పెడుతుంటే భారతదేశంలో మాత్రం ఆయన విగ్రహాలను అవమానం చేస్తున్నారన్నారు. చెప్పలేని విధంగా కాగితపు అట్ట పై రాతలు రాయడం సిగ్గు చేటన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా కొత్త ప్రభుత్వం చట్టాలు తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి దోషులను అరెస్ట్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళా మండలి సభ్యులు వెండి కమల, ఎడ్ల సురేష్‌, గడ్డం శ్రీనివాస్‌, రేవు శ్రీను, గిడ్ల వీరప్రసాద్‌, మహిపతి, శాస్త్రి , బాలరాజు, వడ్డి శ్రీనివాస్‌, గంటి సత్యనారాయణ, వాకపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️