ప్రజాశక్తి-పెండ్లిమర్రి (కడప అర్బర్) కడప జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మతి చెందిన ఘోర సంఘటన సంఘటన చోటుచేసుకుంది. పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు పొలాల్లో జరిగిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లాలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులు భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ఉరుములు, మెరుపుల సమయంలో పడిన పిడుగు పాటుకు వ్యవసాయ పనులు, పశువులు కాసుకునేందు కోసం వెళ్లిన ముగ్గురు అక్కడికక్కడే మతి చెందగా మరొకరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తుమ్మలూరు గ్రామానికి చెందిన ముగ్గురు, పగడాలపల్లెకు చెందిన ఒకరు పిడుగుపడే సమయంలో తుమ్మలూరు సమీపంలోని పొలాల్లో ఉన్నారు. వ్యవసాయ పనుల కోసం ఇద్దరు, పశువులు తోలుకొని ఇద్దరు రోజువారీలాగే వెళ్లారు. ఒక్కసారిగా సంభవించిన పిడుగుపాటుకు పశువుల తోలుకవెళ్ళిన నందిరెడ్డి శివపార్వతి(30) ఆమె మరిది కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న నందిరెడ్డి తేజేశ్వర్‌రెడ్డి(10), పగడాలపల్లి గ్రామానికి చెందిన జి.మారుతి ప్రసాద్‌రెడ్డి(30) అక్కడికక్కడే పిడుగుపాటుకు మత్యువాత పడ్డారు. వీరితోపాటు నాగాయపల్లెకు చెందిన కర్ణాటి నరేష్ కుమార్‌రెడ్డి అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈయన్ను కడపకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. రోజువారి వ్యవసాయ పనుల కోసం, పశువుల మేపుకునేందుకు వెళ్ళి నవారు పిడుగుపాటుకు మతి చెందిన సమాచారం తెలియడంతో తుమ్మలూరు గ్రామంలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి. మతి చెందిన వారిలో నందిరెడ్డి శివపార్వతి, నందిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి మతదేహాను వారి స్వగ్రామమైన తుమ్మలూరుకు తరలించగా, మారుతి ప్రసాద్‌రెడ్డి మతదేహాన్ని తన స్వగ్రామమైన పగడాడాల పల్లెకు తరలించారు.
