ముగ్గురు దారిదోపిడీ దొంగలు అరెస్ట్‌

Dec 3,2024 13:42 #arrested, #Three robbers

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారులపై దారిదోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు నరసాపురం రూరల్‌ సీఐ జి.దుర్గా ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ కథనం ప్రకారం … ఈ ఏడాది ఆగస్టు 19 వ తేదీన రాత్రి 216 జాతీయ రహదారిపై మొగల్తూరు కోతులగుంట వద్ద ఎం.దుర్గారావును కొట్టి రూ.22వేలు నగదు, ఫోన్‌ లాక్కొని పారిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముద్దాయిల కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్‌,రాయుడు రాజు, తలపల అశోక్‌ (హిజ్రా)ను అరెస్టు చేశారు. వీరివద్ద నుండి సెల్‌ ఫోన్‌,బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు ఎస్సైలు జి.వాసు, వై.నాగలక్ష్మి ఏఎస్సై సీహెచ్‌.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️