కంచిలి (శ్రీకాకుళం) : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలంత్రకోట కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా నుంచి గత సంవత్సరం (2023-24) 10వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థులలో ముగ్గురు విద్యార్థులు ఐఐఐటి కి ఎంపికయ్యారు. నూజివీడుకి మురళి గౌడొ, బలరాం పాత్రొ, శ్రీకాకుళం స్నేహలత ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర మిశ్రా, ఉపాధ్యాయ సిబ్బంది, ఆ ముగ్గురు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
