ప్రజాశక్తి-మార్కాపురం: పొదుపు మహిళలు రుణాలు సద్విని యోగం చేసుకుంటూ వివిధ రకాల వ్యాపారా లతో ఆర్థికంగా బలపడాలని డిఆర్‌డిఎ ప్రా జెక్టు డైరెక్టర్ టి.వసుంధర అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మార్కాపురం నియో జకవర్గ పరిధిలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాలకు సంబం ధించిన వివోఏలకు ప్రాజెక్టులో నిర్వహిస్తున్న రుణాల రికవరీపై అవగాహన సదస్సు బుధ వారం జరిగింది. ఉమెన్ లీడ్ ఎంటర్‌ప్రైజెస్ ఎస్‌హెచ్‌జి ఇన్కమ్ ప్రొఫైల్ యాప్ సర్వే గురించి, బ్యాంకు రుణాల గురించి, బాల్య వివాహాల గురించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, జండర్ అంశాలపై ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర మాట్లాడారు. గ్రామ స్థాయిలో పేదలతో పనిచేస్తున్న గ్రామ సంఘ వివోఏలు చక్కగా పనిచేయాలని కోరారు. అన్ని రకాల సర్వేలను తప్పులు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. మహిళా సంఘ సభ్యులు తీసుకున్న రుణాలు ద్వారా జీవనోపాదులను మెరుగుపరచుకొని, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతకు ముందు మహిళలను చైతన్యం చేసే దిశగా అవగాహన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఐ.బి నరసింహారావు, ఎస్వీఈపీ ఏ.పీఎమ్ సుబ్బారావు, తర్లుపాడు ఏపీఎం రమేష్, మార్కాపురం ఏపీఎం డి.పిచ్చయ్య, స్త్రీ నిధి మేనేజర్ సులోచన, ఎల్‌సి నాగభూషణం, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.