సెంచూరియన్‌ బస్సును ఢకొీన్న టిప్పర్‌

May 15,2024 22:08

ప్రజాశక్తి-బొండపల్లి : మండల కేంద్రమైన బొండపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సెంచూరియన్‌ యూనివర్శిటీకి చెందిన బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢకొీనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వారిలో ఒక విద్యార్థినికి కాలు విరిగిపోయింది. గజపతినగరం నుంచి నెలిమర్ల మండలం చందకపేట వద్ద ఉన్న సెంచూరియన్‌ యునివర్సిటీకి విద్యార్ధులను తీసుకువెళ్తున్న బస్సును గజపతినగరం వైపు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ అదుపు తప్పి బలంగా ఢ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్ధులకు గాయాలు కాగా వీరిలో లోగిస గ్రామానికి చెందిన వసంత కుమారికి కాలు విరిగిపోయింది. వెంటనే స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేటుఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ప్రమాదంలో బస్సును నడుపుతున్న డ్రైవర్‌ కృష్ణంరాజు క్యాబిన్‌ లో ఇరుక్కుపోవడం తో కట్టర్‌తో రాడ్‌లను కట్‌ చేసి ఆయనను బయటకు తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️