ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేసే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని అధికారమే పరమావధిగా చెలరేగిపోతున్నారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు నడుచుకుంటే భవిష్యత్తులో వారు న్యాయస్థానాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
