‘ఉపాధి’ కూలి రూ.300 : పీడీ శ్రీనివాస్‌

Apr 1,2024 21:17
'ఉపాధి' కూలి రూ.300 : పీడీ శ్రీనివాస్‌

ప్రజాశక్తి – ఏర్పేడు మండలంలోని సీతారాంపేట పంచాయతీలో జరుగుతున్న పర్క్యూలేషన్‌ పాండ్‌ పూడిక తీత పనులను డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ సి.వి శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి కూలీలతో మాట్లాడారు. ఈ వేసవిలో ఎండలు తీవ్రమవుతున్నందువలన ఉదయం 6 గంటలకు పని మొదలుపెట్టి కొలతల ప్రకారం పనిచేసి 10 గంటల కల్లా పని విడిచి పెట్టాలని, పని వద్ద తాగునీరు, నీడ, గ్రామంలోని ఏఎన్‌ఎం సహకారంతో ఓ ఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు, ప్రధమ చికిత్స పెట్టే వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా రైతుల బోర్లలో, బావులలో మీరు పుష్కలంగా ఉండుటకు రైతుల పొలాలలో ఫారం పాండ్లు తవ్వి వర్షపు నీటిని ఒడిసి బట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యక్రమాదికారి అవిలాల దేవరి, ఈసీ బాలాజీ రావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సరిత పాల్గొన్నారు.

➡️