ఐఐటి పెండింగ్‌ పనులు పూర్తవ్వాలి : కలెక్టర్‌

ఐఐటి పెండింగ్‌ పనులు పూర్తవ్వాలి : కలెక్టర్‌ తిరుపతి టౌన్‌ : కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి లో పెండింగ్‌ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీ శ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐఐటి కు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్‌ ,జెసి శుభం బన్సల్‌ తో కలిసి ఐఐటి డీన్‌ ప్లానింగ్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ మురళీకష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్‌ చమన్‌ మెహతా, ఈఈ సివిల్‌ చైతన్య, సంబంధిత అధికారులతో సమీక్షించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ కు తాగు నీరు అంశంపై ఆర్‌ డబ్ల్యు ఎస్‌ శాఖ వారు దష్టి పెట్టి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. వీధి దీపాలు ఏర్పాటుకు సంబంధించి అంచనాలు తయారు చేయాలన్నారు. ఆర్టీసీ వారు ఐఐటి రిక్వెస్ట్‌ బస్‌ స్టాప్‌ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ సంబంధిత సమస్యలు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవి శంకర్‌ రెడ్డి, ఎస్‌.ఈ లు ఏపీఎస్పీడిసిఎల్‌ కష్ణా రెడ్డి, ఆర్‌ డబ్ల్యూఎస్‌ విజయ కుమార్‌, ఐఐటి ప్రతినిధులు, జి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️