ఓటుహక్కుకు చివరి అవకాశం

ఓటుహక్కుకు చివరి అవకాశం

ఓటుహక్కుకు చివరి అవకాశంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా ఓటుహక్కు పొందేందుకు అర్హులని, ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇదే చివరి అవకాశమని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ లక్ష్మీ శ అన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ప్రజాప్రతినిధులను ఎన్నుకోడానికి ఓటే వజ్రాయుధం కాబట్టి, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 14లోపు అందే దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పది రోజుల్లో పరిశీలించి, మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సోమవారం ఎన్నికల సంసిద్ధత, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధతకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ పెంచల కిషోర్‌, ఈఆర్‌ఒ అదితిసింగ్‌, నిశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️