కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!తిరుపతి, వెంకటగిరి పెండింగ్‌ఐదుచోట్ల ప్రకటించిన అధిష్టానంత్రిముఖ పోటీకి రంగం సిద్ధం

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!తిరుపతి, వెంకటగిరి పెండింగ్‌ఐదుచోట్ల ప్రకటించిన అధిష్టానంత్రిముఖ పోటీకి రంగం సిద్ధం

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!తిరుపతి, వెంకటగిరి పెండింగ్‌ఐదుచోట్ల ప్రకటించిన అధిష్టానంత్రిముఖ పోటీకి రంగం సిద్ధంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సార్వత్రిక, ఎపిలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు మూడో కూటమి (ఇండియా వేదిక) ఎన్నికల సమరానికి సై అంది. తిరుపతి, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయించి చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అభ్యర్థులను ఇడుపులపాయలో రాష్ట్రవ్యాప్త జాబితాలో భాగంగా ప్రకటించారు.చంద్రగిరి అసెంబ్లీకి డాక్టర్‌ కనుపర్తి శ్రీనివాసులు (వాసు)ను ప్రకటించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. డాక్టర్‌ వృత్తి చేసుకుంటూ చంద్రగిరి మండల కేంద్రం కొత్తపేటలో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి అసెంబ్లీకి ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు (లేట్‌) కుమారుడు పోతుగుంట రాజేష్‌నాయుడును ప్రకటించారు. డాక్టర్‌ వృత్తిని ఎంచుకున్న ఆయన వివిధ వ్యాపారాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో స్థిర నివాసం ఉంటున్నారు. సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థిగా బాల గురవం బాబును ప్రకటించారు. చెన్నరులో వ్యాపారాలు చేసుకుంటున్న ఆయన సత్యవేడు మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా గాడి తిలక్‌బాబును ప్రకటించారు. నాయుడుపేట వాస్తవ్యులు. బిఎస్‌సి, ఎల్‌ఎల్‌బి చేసి హైకోర్టులో న్యాయవాది వృత్తిలో ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన చిల్లకూరు వేమయ్యకు టిక్కెట్‌ ఇచ్చారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్‌వాదిగా ఉన్నారు. చిల్లకూరు మండల పరిషత్‌ ఎంపిటిసిగా గెలుపొంది ప్రస్తుతం తిరుపతి జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

➡️