కూలుతున్న కాపురాలు

Apr 1,2024 21:16
కూలుతున్న కాపురాలు

ప్రజాశక్తి – రామచంద్రాపురం, బైరెడ్డిపల్లిప్రేమ వ్యవహారంలో ప్రేమించిన ప్రియురాలు దూరమైందని. ప్రియురాలే తన ప్రాణంగా భావించిన వెటర్నరీ అసిస్టెంట్‌ ప్రేమ కుమార్‌ (26) మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఎస్‌ఆర్‌ పురం లో జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్‌ఆర్‌ పురం మండలం, యమ్మాపురం గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న ప్రేమ కుమార్‌ అదే సచివాలయం పరిధిలోని ఓ వివాహిత మహిళ వాలంటీర్‌ తో ప్రేమ పారాయణం సాగించాడు. ఆ వాలంటీర్‌ కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని కొంతకాలం క్రితం ఆ మహిళను వాలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయించి బెంగుళూరు కి పంపించేశారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్‌ ప్రేమ్‌ కుమార్‌ బెంగళూరుకు వెళ్లిపోయిన ప్రియురాలితో చరవాణిలో ( ఫోన్లో ) మాట్లాడుకుంటూ కాలం గడిపాడు. అయితే ఇటీవల అదే సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తో అక్రమ సంబంధం పెట్టుకుందేమోనని అనుమానం ప్రేమ కుమార్‌ కు ఏర్పడింది. ఈ అనుమానంతో ప్రేమ కుమార్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పై ఘర్షణకు పాల్పడినట్లు స్థానికుల అంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ప్రేమ్‌ కుమార్‌ తన ఫోన్‌ నుండి బెంగళూరులో ఉన్న ప్రియురాలికు అనేకమార్లు ఫోన్‌ చేసి మానసిక ఒత్తిడికి గురై ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రియురాలు రాత్రి 11 గంటల నుండి 140 సార్లు ప్రేమ్‌ కుమార్‌ కి ఫోన్‌ చేసింది. ఫోన్‌ తీయలేదు. అప్పటికే మతి చెందాడు. గ్రామస్తులు సోమవారం ఉదయం ప్రేమ కుమార్‌ ఉరి వేసుకుని చనిపోయిన విషయాన్ని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. సచివాలయ సిబ్బంది ప్రేమ్‌ కుమార్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ్‌ కుమార్‌ తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రాజా కుళ్లయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ కుమార్‌ ది హత్యా….. ఆత్మహత్య అనేది అనుమానాస్పదంగా ఉందని ప్రేమ కుమార్‌ తల్లిదండ్రులు స్థానికులు అంటున్నారు. ఈ ఘటనలతో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఉప్పలివంకలో విషాదఛాయలు అలముకున్నాయి. కె.సుబ్రమణ్యం, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ప్రేమ్‌కుమార్‌ పెద్దకుమారుడు. తండ్రి సుబ్రమణ్యం కాసిరాయి కొట్టి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లలను చదివించాడు. సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అయితే అతని మరణం వారిని తీవ్రంగా కుంగదీసింది. భార్యాబిడ్డలను వదిలేసిన ఈశ్వర్‌బైరెడ్డిపల్లి మండలంలోని తావడ కుప్పం గ్రామంలోని సుబ్బన్న కుమారుడు ఈశ్వర్‌కు, ఆంజప్ప కుమార్తె వసంతమ్మకు 14 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ప్రతాప్‌ (12), మాధవి (10) పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వర్‌ అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి, రెండు వారాల క్రితం ఎక్కడికో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి సుబ్రమణ్యం తన కుమార్తె మార్చి 19వ తేదీ నుంచి కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కృష్ణయ్య కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 31న ఆదివారం ఈశ్వర్‌ను అరెస్టు చేశారు. మొదటి భార్య వసంతమ్మకు, పిల్లలకు న్యాయం చేయాలని అంగన్‌వాడి యూనియన్‌ లీడర్లు జ్యోతి, వెంకటరత్నలు పోలీసు స్టేషన్‌ చేరుకుని వసంతమ్మకు మద్దతుగా నిలిచారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. అమ్మాయి మైనర్‌ కావడంతో ‘హోం’కు తరలించినట్లు తెలిపారు.

➡️