కృతజ్ఞతలు చెప్పడం రాజకీయమా..?నేనూ ఎర్రజెండా నీడనే పెరిగా…టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్

కృతజ్ఞతలు చెప్పడం రాజకీయమా..?నేనూ ఎర్రజెండా నీడనే పెరిగా...టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్

కృతజ్ఞతలు చెప్పడం రాజకీయమా..?నేనూ ఎర్రజెండా నీడనే పెరిగా…టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఃనా అధికారం పేదలకు మేలు చేయడానికే.. నేను కూడా ఎర్రజెండా నీడన పెరిగినవాడినే..ః అని 38 నెలల పాటు నిరాహారదీక్షలు చేసి సఫలీకృతం అయిన టిటిడి అటవీ కార్మికులతో ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నేతృత్వంలో టిటిడి ఛైర్మన్‌ను అటవీ కార్మికులు సత్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ టిటిడిలోని కాంట్రాక్టు, కార్పొరేషన్‌, సొసైటీల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ న్యాయం జరిగేలా చూస్తున్నానన్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా వారి డిమాండ్లు పరిష్కరిస్తానన్నారు. తాను కేవలం ఓట్ల కోసం ఈ పనులు చేయడం లేదని, సామాన్యులకు మేలు చేయడమే తన సిద్ధాంతమని అన్నారు. పేదవారి కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వారిపై రాజకీయ బురద చల్లడం మంచిది కాదన్నారు. కమ్యూనిస్టులతో తనకు భావసారూప్యత ఉన్నందునే కొన్ని అంశాల్లో వారితో కలిసి పనిచేస్తున్నానన్నారు. ఈ మాత్రానికే వారిమీద బురద చల్లడం మంచిది కాదన్నారు. తన దష్టికి వచ్చిన టీటీడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గోశాల కార్మికులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలపై అధికారులతో చర్చించి వీలైనన్ని పరిష్కరిస్తాననిహామీ ఇచ్చారు.

➡️