చదువుతో పాటు వ్యాయామం అవసరం

చదువుతో పాటు వ్యాయామం అవసరం

చదువుతో పాటు వ్యాయామం అవసరం ప్రజాశక్తి -తిరుపతి సిటీ చదువుతోపాటు శారీరిక వ్యాయామం అవసరమని రుయా ఆసుపత్రి సూపర్డెంట్‌ డాక్టర్‌ రవి ప్రభు అన్నారు. స్తానిక వరదరాజు నగర్‌ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్‌ ఇన్చార్జ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పేరంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ను ఇస్కాన్‌ గ్రాండ్‌ లో శుక్రవారం ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లడుతూ చదువు తో పాటు శారీరక వ్యాయమంఎంతో అవసరమని దీని వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌ లో వాకింగ్‌, యోగా లాంటివి చాలా మంది చేయలేకపోతున్నారు. అనంతరం తల్లిదండ్రులతో యోగ, ఎరోబిక్స్‌ చేయించారు. తల్లిదండ్రులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వీటిని చేసి ఆనందించి తిరిగి తమకి తమ బాల్యంను జ్ఞాపకం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ బాలాజీ, లిటిల్‌ ఛాంప్స్‌ ఇన్‌ చార్జ్‌ పధాకుమారి పాల్గొన్నారు.

➡️