జాతీయరహదారికి కూతవేటులోనే..చెరువులో ‘రాజ’మార్గం రెవెన్యూ ప్రేక్షకపాత్ర ఇరిగేషన్‌ ‘మౌన’వ్రతం

జాతీయరహదారికి కూతవేటులోనే..చెరువులో 'రాజ'మార్గం రెవెన్యూ ప్రేక్షకపాత్ర ఇరిగేషన్‌ 'మౌన'వ్రతం

జాతీయరహదారికి కూతవేటులోనే..చెరువులో ‘రాజ’మార్గంశ్రీ రెవెన్యూ ప్రేక్షకపాత్ర శ్రీ ఇరిగేషన్‌ ‘మౌన’వ్రతంప్రజాశక్తి – ఓజిలి జాతీయ రహదారికి ఆనుకుని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి రహదారి ఏర్పాటు చేసుకుని అక్రమంగా రాజమార్గం సృష్టించుకుంటే రెవెన్యూ యంత్రాంగం ఎప్పటిలానే ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఇరిగేషన్‌ అధికారులు లేఖ రాసి ‘మౌన’వ్రతం పాటిస్తున్నారు. కనీసం ‘హెచ్చరిక’ బోర్డులు కూడా పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ కురువృద్ధుడు రాజకీయ అండదండలతో దర్జాగా ఆక్రమించుకున్న చెరువు స్థలాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓజిలి మండలం రాచపాళెం చెరువు పోరంబోకు భూముల నుంచి ఏకంగా జాతీయ రహదారికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. భూమిలేని నిరుపేదలు కొంత భూమిని సాగు చేసుకుంటుంటేనే పోలీసు బలగాలతో హుటాహుటిన విచ్చేసి నిమ్మచెట్లను ఏర్లతో సహా పీకేసి రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారునికి మాత్రం కొమ్ముగాస్తోంది. ఈ అక్రమ మార్గం వల్ల ఓజిలి పెద్దచెరువుకు నీరు అందించే ప్రధాన కాల్వ మట్టితో కప్పేయబడింది. దీంతో పెద్దచెరువుకు నీరు చేరే అవకాశమే లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. కొత్త తహశీల్దార్‌ దృష్టికీ తీసుకెళతాం : బి.శ్రీనివాసులు, ఇరగేషన్‌ ఎఇచెరువు భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రహదారి విషయమై గత తహశీల్దార్‌ శివరామ సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లాం. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే గత తహశీల్దార్‌ బదిలీ అయ్యారు. నూతన తహశీల్దార్‌ దృష్టికీ తీసుకెళతాం.

➡️