తిరుమలలో ఏనుగులు హల్‌చల్‌

Feb 11,2024 22:39
తిరుమలలో ఏనుగులు హల్‌చల్‌

ప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. ఆదివారం వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు సంచరించి అక్కడున్న ఇనుప కంచెను, చెట్లను నెలకూల్చి రోడ్డుపైకి వచ్చి వెళ్లినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తిరిగి అవి రోడ్డుపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో వెదురు చెట్లు అధికంగా ఉండడంతో, ఆ చెట్టు కాసే పూలను తినడానికి ఏటా ఇదే నెలలో ఏనుగులు గుంపు పార్వేట మండపం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని వారు అంటున్నారు. ఏనుగుల గుంపు సంచారంలో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలను సూచిస్తున్నారు.

➡️