‘నారాయణ’ ప్రభంజనం

‘నారాయణ’ ప్రభంజనంప్రజాశక్తి -తిరుపతి సిటీ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) విడుదల చేసిన జనవరి -2024 మొదటి విడత జేఈఈ మెయిన్స్‌ ఫలితాలలో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డీజిఎం కొండలరావు తెలిపారు. న్యూ బాలాజీ కాలనీలోని నారాయణ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జెఈఈ మెయిన్స్‌ ఫలితాలలో తమ విద్యార్థులు వివస్వత్‌ 99.9, వివేకానంద రెడ్డి 99.8, దినేష్‌ ప్రసాద్‌ రెడ్డి 99.8, జస్వంత్‌ 99.8, సాయి ప్రసన్న 99.8, చెంచు తన్మయి క్రిష్ణ 99.8, పుష్కర్‌ 99.8 శాతం సాధించారన్నారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు 99.8 శాతం కన్నా ఎక్కువ సాధించారని, అదేవిధంగా 99 శాతం పైన 16 మంది, 98 శాతం పైన 25 మంది, 95 శాతం పైన 65 మంది, 90 శాతం పైన మొత్తం 125 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభచూపిన విద్యార్థులను అభినందించారు.

➡️