నీటిని వృథా చేస్తే చర్యలు : కమిషనర్‌

నీటిని వృథా చేస్తే చర్యలు : కమిషనర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నగర ప్రజలు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ అదితిసింగ్‌ చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ తాగునీటి అవసర నిమిత్తం తెలుగుగంగ(కైలాసగిరి రిజర్వాయరు), కళ్యాణి డ్యాం, 388 పవర్‌ బోర్‌ వెల్స్‌, 226 చేతి పంపుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితి వలన రాబోవు మూడు నెలల్లో తెలుగుగంగ, కల్యాణిడ్యాం నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రోడ్లు కడగడం, వాహనాలు ఇంటి ముందు కడగడం చేయరాదన్నారు. పాదచారులకు, వాహనదారుల సౌకర్యార్ధం వేసవి దృష్ట్యా చలివేంద్రాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘సేవ్‌ వాటర్‌..సేవ్‌ ఫ్యూచర్‌’ నినాదాన్ని ఆచరించాలన్నారు. సూచనలు పాటించని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

➡️