‘పేట’లో రాజకీయ ‘వలసలుటిడిపి తీర్థం పుచ్చుకున్న వెయ్యి కుటుంబాలు

'పేట'లో రాజకీయ 'వలసలుటిడిపి తీర్థం పుచ్చుకున్న వెయ్యి కుటుంబాలు

‘పేట’లో రాజకీయ ‘వలసలుటిడిపి తీర్థం పుచ్చుకున్న వెయ్యి కుటుంబాలు ప్రజాశక్తి – నాయుడుపేట సూళ్లూరుపేట నియోజకవర్గంలో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి నెలవల విజయశ్రీ చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల్లో మొదటిసారిగా ఆమె రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ ఆమె తండ్రి సూళ్లూరుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నెలవల సుబ్రమణ్యంకు ప్రతి ఒక్కరితో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆమెకు కలిసొస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎపై ఉన్న వ్యతిరేకతతో కొంతమంది టిడిపిలోకి రాజకీయ వలసలు ప్రారంభించారు. ఈ అంశాలన్నీ ఆమెకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని చర్చ నడుస్తోంది. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు, కొందరు నాయకులు నింతల్లా వ్యవహరించడం వల్ల అధికార పార్టీలోని కొందరు నెలవల విజయశ్రీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. నెలవల విజయశ్రీ పేరును ఖరారు చేసినప్పటి నుంచి సుడిగాలిలా నియోజకవర్గమంతా పర్యటనలు చేస్తూ నాయకులను, కార్యకర్తలను కూడగట్టుకుంటున్నారు. తండ్రి పంథాలోనే ఆమె నడవడం, రాజకీయ మెళకువలను నేర్చుకుంటూ తండ్రికి తగ్గ తనయగా అందరినీ కలుపుకుపోతున్నారని చర్చ నడుస్తోంది. ఆమె పేరును ఖరారు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ అన్ని గ్రామాల్లో ఏకబిగిన దాదాపు వెయ్యి కుటుంబాలు టిడిపి కండువా కప్పుకున్నాయి. అందులోనూ నాయుడుపేట పట్టణంలో అధిక సంఖ్యలో ఉండటం నెలవల మార్క్‌ రాజకీయం కనిపిస్తోంది.

➡️