పేదలకు భూములివ్వాలని సిపిఎం పోరాటంవ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

పేదలకు భూములివ్వాలని సిపిఎం పోరాటంవ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

పేదలకు భూములివ్వాలని సిపిఎం పోరాటంవ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావుప్రజాశక్తి – ఓజిలి సిపిఎం ఆధ్వర్యంలో మాచవరం గ్రామంలో భూ పోరాటం చేశారు. ఓజిలి మండలం మాచవరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో భూముల్లో జెండాలు పాతి ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 207 ,208 ,226 లో వందలాది ఎకరాలు మిగులు భూములు ఉన్నాయని 1985 లోనే సుమారు 55 మంది పేదలకు లీజ్‌ పట్టాలు రెవెన్యూ అధికారులు ఇచ్చారని గుర్తు చేశారు. ఓజిలి మండల కేంద్రంలో వందల ఎకరాలు భూస్వాములు ఆక్రమించి దర్జాగా కబ్జా చేస్తున్నా రెవిన్యూ యంత్రాంగానికి కనబడలేదా అని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో పేదలకు భూములు దక్కకుండా అధికార యంత్రాంగం పేద కార్మికులపై దౌర్జన్యాలకు దిగడం సరికాదని తెలిపారు. ఈ సర్వే నంబర్‌ భూముల్లో సాగు చేయకూడదని చెప్పిన రెవెన్యూ యంత్రాంగం అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తా ఉంటే కళ్ళు మూసుకుని పరిపాలన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చాపల వెంకటేశ్వర్లు ,శివకవి ముకుంద, గోపాలయ్య ,పద్మమ్మ చెంగయ్య , చంద్రకళ ,మాచవరం పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

➡️