ప్రయాణంలో ఇంటి భోజనం

Mar 31,2024 22:46
ప్రయాణంలో ఇంటి భోజనం

శ్రీ ప్రతి స్టేషన్‌లోనూ ముందస్తు ఆర్డర్‌తో సిద్ధంశ్రీ కొత్త వ్యాపారానికి మంచి ఆదరణప్రజాశక్తి- తిరుపతి సిటి సుదూర ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తు ప్లానింగ్‌ లేకపోవడం, సరైన సమయం దొరకపోవడం, ఇతరాత్ర కారణాలతో ఆహారాన్ని తెచ్చుకోలేక, అలాగని రైల్వేస్టేషన్‌, బస్టాండుల్లో దొరికే నాణ్యత, రుచి, పచిలేని ఆహారాన్ని తినలేక అనేక మంది వస్తులతో ప్రయాణం చేస్తుండడం సరామామూలే. అలా ఇబ్బంది పడే ప్రయాణికులకు ఇంటి భోజనాన్ని రుచి, శుచిగా, తాజాగా అందించాలనే ఉద్దేశ్యంతో రూపుదిద్దుకొంది. ప్రయాణంలో ఇంటి భోజనం కాన్సెప్ట్‌. ఏయే ప్రాంతంలో ఎన్ని గంటలకు, ఎంత మందికి భోజనం కావాలో ముందస్తుగా ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే చాలు. వారు ఆ స్టేషన్‌కు చేరుకునేసరికి తాజా భోజనం వారి చెంతకు చేరుతుంది. కొత్త వ్యాపారానికి ప్రయాణికులు ముగ్దులు కావడంతో ఆదరణ పెరిగి, దినదినాభివృద్ధి చెందుతుండడం గమనార్హం. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వల్ల చాలా మందికి అనేక ఇబ్బందులు తప్పలేదు. చాలా ఇళ్లల్లో ఇల్లాలు కరోనా భారిన పడడంతో ఆ ఇంటి వారికి ఆహార సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రిలో, క్వారెంటైన్‌లో ఉండే వారికి కూడా సరైన ఆహారం దొరకడం కష్టంగా మారింది. తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతంలో విష్ణునివాసం, శ్రీనివాస కాంప్లెక్స్‌, తిరుచానూరు పద్మావతి నిలయంలో ఉండే వారికి టిటిడి, చంద్రగిరి ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆహార సరఫరా చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డారు. సరిగ్గా అదే సమయంలో తిరుపతికి చెందిన లక్ష్మీకి ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. బోజనం కోసం ఇబ్బంది పడుతున్న వారికి పౌష్టికాహారాన్ని సరఫరా చేయాలని తలిచింది. అనుకున్నదే తడువుగా వెనువెంటనే శ్రీబ్రాహ్మణ కర్రీపాయింట్‌ను స్థాపించిపంది. 99598 59227 ఫోన్‌ నెంబరుకు ఆర్డరు ఇస్తే చాలు తిరుపతి, పరిసరాల ప్రాంతాల్లో ఎక్కడికైన వీలైంనత తక్కువ సమయంలో శుచి, రుచి కల్గిన ఆకు కూరలు, కూరలు, వేపుళ్లు (కర్రీస్‌) సరఫరా చేసేది. ఒక పక్క కరోనో విజృంభిస్తున్న లెక్క చేయకుండా పది మందికి పౌష్టికాహారం ఇవ్వాలని తలిచి, బోజన సరఫరాను కూడా ప్రారంభించింది. ప్రతి రోజు వందలాది మందికి బోజనం అందించేది. ఒక పక్క కరోనా బాధితులకు పౌష్టికాహారం ఇస్తూనే, మరో పక్క వ్యాపార పరంగా కుటుంబ పోషణనకు బాటలు వేసింది. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు సహకరించడంతో వ్యాపారం జోరందుకుంది. కొన్ని రోజులకు రాను రాను కరోనా తగుముఖం పట్టింది. లాక్‌డౌన్లు దశలవారీగా సడలించారు. దీంతో ఆమె కర్రీస్‌ పాయింట్‌కు ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. అయిన ఆమె ఆదైర్యపడకుండా కర్రీస్‌ పాయింట్‌తో పాటు క్యాటరింగ్‌ను ప్రారంభించింది. ఇళ్లల్లో జరిగే అన్ని రక ఆల శుభకార్యాలకి, గృహాప్రవేశాలకు, పెళ్లిళ్లకు, నోములు, వ్రతాలు, కిట్టి పార్టీలకు, బ్రహ్మణ బోజనాన్ని కోరిన విధంగా క్యాటరింగ్‌ పద్దతిలో అందించేంది. దేవాలయాలకు మడిగా ప్రసాదాలు అందజేయడం వీరి ప్రత్యేకత. ఆ నేపథ్యంలో ఆమెకు మరో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో దేశ నలుమూలల్లోని సుదూర ప్రాంతాల నుంచి రకరకాల ప్రాంతాలకు చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వస్తుంటారు. తిరుపతికి ప్రతి రోజు లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతికి వచ్చే వారిలో అధిక మంది హోటల్‌ పుడ్‌ పట్టక, సరైన, నాణ్యమైన భోజనం అందక ఇబ్బంది పడుతున్నారని గమనించి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాజా, శుచి, రుచికరమైన బ్రాహ్మణ పద్దతిలో శాఖహార బోజనాన్ని అందించాలని భావించింది. తిరుపతి మీదగా ప్రయాణించే వారు ముందస్తుగా తమ ఫోన్‌కు సమాచారం ఇచ్చి, ఏ సమయానికి, ఎక్కడికి, ఎంత మందికి భోజనం కావాలో తెలియజేస్తే చాలా ఆ సమయానికి అక్కడికి తాజా పౌష్టికాహారాన్ని అందించేలా వ్యాపారాన్ని ప్రారంభించింది. దీనికి ఆదరణ దక్కడంతో విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం నుంచి స్థానిక వ్యాపారులు వీరిని సంప్రదించి, బ్రాంచిలను ఏర్పాటు చేశారు. ప్రయాణ భోజనం సరఫరా ప్రచారం అందరికీ చేరడంతో అటు ప్రయాణికులు, ఇటు వ్యాపారులు ఆయా ప్రాంతాల వారిని సంప్రదించడం పెరిగింది. దీంతో లక్ష్మీని ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారికి ఆయా స్టేషన్‌లో బోజనం సరఫరా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం విజయవాడ, బెంగుళూరు, సికింద్రాబాద్‌, విశాఖపట్టణం (వైజాగ్‌), కాకినాడ, తిరుపతి, న్యూడిల్లీ, చెన్నరు తాంబరం, రాజమండ్రి, నెల్లూరు, వారణాసి, షిర్డి, ఒరిస్సా, గుంటూరు, అరుణాచలం, ఏలూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఆంధ్ర బ్రాహ్మణ భోజనాన్ని ప్రయాణీకులకు చేరువేస్తున్నారు. రైలు, బస్సు, కారు, ఇతర వాహనాల్లో వచ్చే వారికి కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తిరుపతి కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా లక్ష్మీ ప్రతి రోజు రూ.1000 నుంచి 1500ల వరకు ఆదాయాన్ని అర్జిస్తుంది. వారాంతపు రోజుల్లో (వీకెండ్‌ డేస్‌లు) రోజుకు 3వేల రూపాయలకు వరకు ఆదాయం సంపాదిస్తుంది. ప్రస్తుతం పిల్లల పరీక్షల సమయం కావడంతో ఆ మాత్రం వ్యాపారం, ఏఫ్రిల్‌లో సెలువులు ప్రారంభమైతే ప్రయాణికులు తాకిడి ఎక్కవుగా ఉంటుంది. ఆ సమయంలో రోజుకు రూ.3 నుంచి 4వేల వరకు, నెలకు రూ.లక్షా 50వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ సరికొత్త వ్యాపారానికి ఆదారణ పెరుగుతుండడం గమనార్హం.

➡️