బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి : కలెక్టర్‌

బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి : కలెక్టర్‌

బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి : కలెక్టర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, అన్ని రంగాలలో వారు ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని కలెక్టర్‌ డా.జి. లక్ష్మీ శ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందన హాల్‌ నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఆడపిల్లల పరిరక్షణకై గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం -1994 అంశపై నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్‌, వక్తత్వ పోటీలలో పాల్గొని గెలుపొంది జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన మొత్తం తొమ్మిది మంది ప్రభుత్వ పాఠాశాలల పిల్లలకు కలెక్టర్‌ చేతుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీహరి, జిల్లా విద్యా శాఖ అధికారి వి.శేఖర్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐశా, పావని, డిపిఎంఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.డిఎస్‌సి అభ్యర్థులకు

➡️