‘బియ్యం’కు చికెన్‌, గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం

'బియ్యం'కు చికెన్‌, గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం

‘బియ్యం’కు చికెన్‌, గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి కరోనా కాలంలో ముస్లింలకు ఉచితంగా అందజేసిన చికెన్‌, కోడిగుడ్లు, కూరగాయలను తన రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారనీ, ఆయనకు అవి తిరిగి ఇచ్చేస్తామని టీడీపీ మైనార్టీ విభాగం ముస్లిం నాయకులు అన్నారు. సోమవారం ముస్లింలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చికెన్‌, గుడ్లు, కూరగాయలు చేతబట్టి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి కరోనా సమయంలో తమకు చికెన్‌ గుడ్లు పంచి పెట్టాను అని, గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్పిందే చెబుతూ అన్ని వేదికల పైన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడని, దానిని రాజకీయంగా వాడుకుంటున్నారని విసుగు పుట్టి తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్కసారి చికెన్‌ , గుడ్లు ఇవ్వడం తప్ప మైనారిటీల కోసం పెద్దగా ఏమీ చేయలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి సాయం చేశారని, దాన్ని రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటన్నారు.

➡️