భక్తులకు సహనంతో సేవలందించాలి : పట్టాభిరామ్‌

భక్తులకు సహనంతో సేవలందించాలి : పట్టాభిరామ్‌

భక్తులకు సహనంతో సేవలందించాలి : పట్టాభిరామ్‌ప్రజాశక్తి – తిరుపతి సిటిశ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని ప్రముఖ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ బివి.పట్టాభిరామ్‌ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం టీటీడీ ఉద్యోగులకు ”విధినిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం ఎలా” అనే అంశంపై డాక్టర్‌ పట్టాభిరామ్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించేందుకు మన ఆలోచనలను, పని విధానాన్ని మార్చుకోవడం, ఇతరులతో గౌరవప్రదంగా మాట్లాడడం, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలు మన ఆధీనంలోనే ఉంటాయన్నారు.ఉద్యోగులకు నైతిక ప్రవర్తన చాలా ముఖ్యమన్నారు. శ్వేత సంచాలకులు భూమన్‌ మాట్లాడుతూ ఆసక్తి గల ఉద్యోగులు శేషాచలంలోని తీర్థాలను దర్శించుకునేలా త్వరలో ట్రెక్కింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ సాయికష్ణ యాచేంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, సీవీఎస్వో నరసింహ కిషోర్‌ పాల్గొన్నారు.

➡️