భవ్యకు కలెక్టర్‌ అభినందనలు

భవ్యకు కలెక్టర్‌ అభినందనలు

భవ్యకు కలెక్టర్‌ అభినందనలుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌స్థానిక బైరాగి పట్టెడలోని మహాత్మా గాంధీ మున్సిపల్‌ హై స్కూల్‌ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కే భవ్య హాకీ క్రీడా పోటీల్లో రాణించినందుకు తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి . లక్ష్మీ శ అభినందించి దుశ్శాలువాతో సన్మానించారు. కే భవ్య డిసెంబర్‌ 2023 లో వైజాగ్‌ లో జరిగిన అండర్‌ 17 హాకీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. తర్వాత నేషనల్‌ కు సెలెక్ట్‌ అయ్యి నేషనల్‌ జట్టులో జనవరి నెలలో హాకీ అండర్‌ 17 కర్ణాటక రాష్ట్రం నందు మడికరై లో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురుగన్‌ . వ్యాయామ ఉపాధ్యాయుని ఎం ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

➡️