మఠం స్థలంలో ఆక్రమణల తొలగింపు

మఠం స్థలంలో ఆక్రమణల తొలగింపు

మఠం స్థలంలో ఆక్రమణల తొలగింపుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)శ్రీ స్వామి హథీరాంజీ మఠానికి చెందిన స్థలంలో నగరంలోని చిరు వ్యాపారులు అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసుకొన్నారని, భవిష్యత్తులో మఠం భూమికి రక్షణ లేకుండా పోతుందనే ఉద్దేశంతో మఠం డిప్యూటీ కలెక్టర్‌, ఫిట్‌ పర్సన్‌ రమేష్‌ నాయుడు ఆదేశాలతో ఏఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ దుకాణాలను, తడికల షెడ్లను తొలగించారు. తిరుపతి -తిరుచానూరు ప్రధాన మార్గాన్ని ఆనుకుని ఉన్న తిరుపతి పట్టణ లెక్క దాఖల సర్వే నెంబరు 54 లో గల 11 ఎకరాల హథీరాంజీ మఠం భూమి ఉంది. కాగా ఆక్రమణల తొలగింపు సమయంలో సిపిఐ నాయకులు అక్కడకు చేరుకొని చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచారు. మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్న స్థలాలను గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ తొలగింపు కార్యక్రమంలో మఠం సిబ్బంది సీతారాం, మధు, తులసి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️