మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలుజిల్లాలో 30,921 మంది విద్యార్థులుసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలుజిల్లాలో 30,921 మంది విద్యార్థులుసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలుజిల్లాలో 30,921 మంది విద్యార్థులుసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జిల్లాలో 2024 టెన్త్‌ పరీక్షలు మార్చి 18 వ తేది నుంచి 30 వ తేది వరకు పకడ్బందీగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ ఆదేశించారు. మొత్తం 30,921 మంది పరీక్ష రాయనున్నారని చెప్పారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ ఉంటుందన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌ నందు సంబంధిత శాఖల సిబ్బందితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో 162 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఏమైనా లోటుపాట్లు ఉండే ముందుగానే చక్కదిద్దాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వదద తాగునీటి వసతి, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, బీపీ, సుగర్‌చెక్‌చేసే పరికరాలు, అత్యవసర మందులతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వదద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. మాస్‌కాపీయింగ్‌ నిరోధించేందుకు ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈ ఓ, డి ఎం హెచ్‌ ఓ శ్రీహరి, డి పి ఓ రాజశేఖర్‌ రెడ్డి, ఆర్‌ ఐ ఓ ప్రభాకర్‌ రెడ్డి, తిరుచానూరు ఇన్స్పెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️