యువ కళాకారులకు ప్రతిభా పురస్కారాలు

యువ కళాకారులకు ప్రతిభా పురస్కారాలు తిరుపతి సిటి : కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయకపోయినా హరినామస్మరణ చేస్తే ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని ఉడిపి పాలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ తెలిపారు. శ్రీ పురందరదాసుల ఆరాధన మహౌత్సవాలు రెండవ రోజైన శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగాయి అనంతరం దాస సాహిత్యంలో విశేష కషి చేసిన 12 మంది యువ కళాకారులకు ప్రతిభ పురస్కారాలు శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ, పాలిమారు మఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విద్యారాజేశ్వతీర్థ స్వామిజీ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

➡️