రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌ప్రజాశక్తి -తిరుమల తిరుమలలో ఈ నెల 16వ తేదీ జరగబోయే శ్రీవారి రథసప్తమి ఉత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్‌ తెలిపారు. ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, మొదటగా తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. టీటీడీ సివిఎస్వో నరసింహా కిషోర్‌ , ఇతర పోలీసు అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ మాడవీధులతో పాటు తిరుమలంతట ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రథసప్తమి ఉత్సవ విషయాలను తెలుసుకున్నారు. రథసప్తమి ఉత్సవాలను సక్సెస్‌ చేయడానికి పోలీసు శాఖ తరపున తమవంతు కషి చేస్తామని మీడియాతో అన్నారు. అంతకముందు ఆమె కుటుంబసభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో తిరుపతి ఎస్పీగా పనిచేసే అవకాశం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

➡️