రాజకీయ ‘చదరంగం’ఉప ఎన్నిక దొంగోట్లపై ‘పోస్టుమార్టం’

రాజకీయ 'చదరంగం'ఉప ఎన్నిక దొంగోట్లపై 'పోస్టుమార్టం'

రాజకీయ ‘చదరంగం’ఉప ఎన్నిక దొంగోట్లపై ‘పోస్టుమార్టం’చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఛాంబర్‌లో విచారణమరింత కూపీ లాగుతున్న ఎన్నికల సంఘంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో 35వేల దొంగ ఓట్లను నమోదు చేశారన్న ఆరోపణతో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ గా పని చేసి ఇటీవల విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్గా బదిలీ అయిన చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల లాగిన్‌ లో దొంగ ఓట్లు ఎలా నమోదు చేశారన్న విషయమై తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఛాంబర్‌లో గత నాలుగు రోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు, పోలీసులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ విషయం రహస్యంగా సాగుతుంది. చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి ఈఆర్‌ఓ కాకపోయినప్పటికీ ఆయన ఈఆర్‌ఓగా ఎలా పని చేశారు. ఏ విధంగా ఓటర్లను చేర్చారు, తిరుపతిలో నివాసం లేకపోయినా ఓటరుగా ఉన్నట్టుగా ఎలా సష్టించారు. ఆ ఓటర్‌ ఉప ఎన్నికల్లో ఓటు వేశారా, లేదా, చనిపోయిన ఓటర్లు బతికి ఉన్నట్లు ఆ ఓట్లు వేశారా. లేదా అనేది డిప్యూటీ కమిషనర్‌ గా పనిచేసిన చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి సంబంధించిన కంప్యూటర్లు ,ల్యాప్టాప్‌లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. చంద్రమౌళీశ్వర్‌ రెడ్డికి దొంగ ఓట్లు నమోదు చేసే సమయంలో సిబ్బంది ఏవిధంగా సహకరించారనేది ఆరా తీస్తున్నారు. ఈ విచారణకు ఎన్నికల సంఘం పోలీస్‌ ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా పోలీసులు ఒక్కొక్కరిని పిలిపించి విచారిస్తున్నారు. సమాచారాన్ని వీడియోల్లో నమోదు చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలోనే చేశారా? లేక వేరే ప్రాంతాల్లో ఈ ప్రక్రియ సాగిందా అనేది విచారణ జరుగుతోంది. చంద్రమౌళీశ్వర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది పాత్ర ఎంతుందో ఈ విచారణలో తేల్చనున్నారు. రాజకీయ నేతల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళిశ్వర్‌ రెడ్డి ఎన్నికల సంఘాన్ని మోసం చేయడమే కాకుండా కుట్ర పన్నారు అనేది ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం ముద్ర వేసింది. కనబడని దస్త్రాలు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు పంపిన పలు జీవో కాపీలు , ఇతర దస్త్రాలు కనబడడం లేదని తిరుపతి నగర పాలక సంస్థలు గుసగుసలాడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పంపిన కొన్ని జీవో కాపీలో పలువురికి ఉద్యోగులకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. ఆ బాధ్యతలు ఎవరెవరు నిర్వహించారు సంబంధించిన ఫైలు పోలీసు ప్రత్యేక బందం నాలుగు రోజుల నుంచి వెతుకులాట చేసిన కనబడడం లేదని సమాచారం. తిరుపతి డిప్యూటీ కమిషనర్‌ ఛాంబర్‌ లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని విభాగాలు సంబంధించిన సిబ్బందిని పిలిపించి ఎన్నికల దస్త్రాలు గురించి ఆరా తీయడం జరిగింది. ఈ దస్తాలు ఉన్నాయా లేదా, లేదంటే దాచి పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి ఈఆర్‌ఓ కాకపోయినప్పటికీ ఐడి లాగిన్‌ పాస్వర్డ్‌ ఇతర సంబంధించిన అధికారాలు ఎలా తీసుకున్నారని చర్చ నడుస్తోంది.క్రిమినల్‌ కేసు నమోదు చేసే అవకాశంఎన్నికల సంఘాన్ని మోసం చేసిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషన్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశంలో ఎక్కడా జరగని విధంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయడమే కాకుండా ఎన్నికల విధులు నిర్వహించి ఎన్నికల సంఘానికి తెలియకుండా ఈఆర్వోగా వ్యవహరించడం కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై చాలా సీరియస్‌ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రమౌళీశ్వర్‌ రెడ్డికి రాజకీయ నేతలు అండగా ఉంటారా? లేక బలిచేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. ఏదిఏమైనా ఎన్నికల విధుల్లో ఉండే ఉన్నతాధికారులకు ఇది ఒక గుణపాఠం.

➡️