రూ.4 లక్షల విలువైన గంజాయి స్వాధీనంపోలీసుల అదుపులో నలుగురు

రూ.4 లక్షల విలువైన గంజాయి స్వాధీనంపోలీసుల అదుపులో నలుగురు

రూ.4 లక్షల విలువైన గంజాయి స్వాధీనంపోలీసుల అదుపులో నలుగురుప్రజాశక్తి-తిరుపతి సిటి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే 20 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు తిరుపతి ఈస్టు డిఎస్‌పి సురేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక ఈస్టు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులకు అందిన సమాచారం మేరకు తిరుపతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వే అతిథిగృహం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసుల విచారణలో వీరు విజయవాడకు చెందిన బి.రూపవతి(65), వీరంకి దుర్గ (52), బండారి కుమారి (45), తిరుపతిలో కాపురం ఉంటున్న నగరిమండలం ఓజికుప్పానికి చెందిన సత్తుపాటి లోకేశ్వరరావు (47)గా గుర్తించారు. నరసరావుపేటలో నిందితులైన ముగ్గురు మహిళలు గంజాయిని కొనుగోలు చేసి, తిరుపతిలో ఉండే నాగేశ్వరావుకు లాట్‌గా అందజేసేవారని, అతను వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి, నగరి, పుత్తూరు తదితర ప్రాంతాల్లో విక్రయించి అక్రమార్జన చేస్తూ యువతను మత్తుకు బానిసలు చేస్తూ, వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లు వెల్లడయిందన్నారు. ఈ కేసులో నిందితుడు గతంలో తమిళనాడులో దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడని, తిరుపతిలో గుట్కా అక్రమ రవాణా కేసులో పాత నేరస్తుడని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం నుండి తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 6 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదు చేసి 19 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 64.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. ఈ కేసు లో ప్రతిభ కనబరిచిన తిరుపతి ఈస్ట్‌ సీఐ మహేశ్వర్‌ రెడ్డి, ఎస్సై పురుషోత్తం రెడ్డి, సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ మునిరాజులు పాల్గొన్నారు.

➡️