స్కూళ్ల రూపురేఖల్లో మార్పులొచ్చాయి

Feb 11,2024 22:38
స్కూళ్ల రూపురేఖల్లో మార్పులొచ్చాయి

శ్రీ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ అవసరంశ్రీ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ప్రోత్సహించాలిశ్రీ ఎంఈవో బాలాజీప్రజాశక్తి- తిరుపతి సిటి ప్రస్తుత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, మారుతున్న పోటీ సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం విద్యార్థుల్లో మార్పు అవసరమని తిరుపతి అర్బన్‌ ఎంఈవో-1 కొల్లూ బాలాజీ తెలిపారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఇటీవల తనను కలిసిన ‘ప్రజాశక్తి’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే…ప్రజాశక్తి: తిరుపతిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్‌ ఎన్ని?ఎంఈవో: తిరుపతి అర్బన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో కలిపి 321 స్కూల్స్‌ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 01, మున్సిపల్‌ కార్పొరేషన్‌వి 44, మండల పరిషత్‌వి 23, టిటిడి (ఎయిడెడ్‌) 08, ప్రయివేట్‌ స్కూల్స్‌ 242, కేంద్ర ప్రభుత్వ పరిధిలో 1, ఏపి ట్రైబల్‌ స్కూల్‌ 1 ఉన్నాయి. ప్రజాశక్తి: నగరంలో స్కూల్‌ పరిధిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?ఎంఈవో: తిరుపతి నగరంలో అన్ని స్కూల్స్‌లో కలిపి 66,745 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో బాలురు 35,752, బాలికలు 30,993 మంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 15,290 మంది, ప్రయివేట్‌ పాఠశాలలో 51,455 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలకు 684మంది విద్యార్థులు హజరైతే 99.20 శాతంతో 679 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రజాశక్తి : నాడు- నేడు పనులు ఏ స్థాయిలో ఉన్నాయి?ఎంఈవో: నాడు- నేడు పనుల కింత పేస్‌-1లో 22 స్కూల్స్‌, పేస్‌-2లో 43 స్కూల్స్‌, పేస్‌2ఏలో 11 స్కూల్స్‌ ఎంపికయ్యాయి. ఇప్పటికే 27 స్కూల్స్‌లో పనులు పూర్తయ్యాయి. మరో 16 స్కూల్‌లో పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన స్కూల్స్‌లో పనులు చివరిదశకు చేరుకున్నాయి. నాడు-నేడు అనేది ప్రభుత్వం తీసుకున్న మంచి పథకం, దీంతో ప్రభుత్వ స్కూల్స్‌ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజాశక్తి: విద్యార్థులు ట్యాబ్‌ల నిర్వాహణ ఎలా ఉంది?ఎంఈవో: బైజూస్‌ ద్వారా తిరుపతిలో చదివే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను ప్రభుత్వ ఆదేశాలతో అందజేశాం. తిరుపతి నగరంలోనే రెండు సంవత్సరాలుగా 1856 మంది విద్యార్థులకు వాటిని అందించాం. ప్రతి సోమవారం ఆయా స్కూల్స్‌ పరిధిలో వాటి వాడకంపై తనీఖీ చేస్తున్నాం. ఇందులో 7 యాప్‌లు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందివ. పీచ్చర్‌స్కిల్‌ ఎక్స్‌ఫర్టును నియమించి, వాటి నిర్వాహణలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తున్నాం. విద్యార్ధికి నిరంతరం మార్పు అవసరం. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు సాంకేతిక అందపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాశక్తి: గతానికి, ప్రస్తుత విద్యారంగానికి తేడా?ఎంఈవో: విద్యారంగం ఎప్పడు ఒకేలా ఉండదు. మేము చదువుకునే రోజుల్లో చెట్ల కింద తరగతులు నిర్వహించేవారు. ఒకరిద్దరు టీచ్చర్లే, పదోతరగతి, ఇంటర్‌ చదివిన వారే ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఇప్పడు ఆపరిస్థితి లేదు. స్కూల్స్‌ పెరిగాయి. ఉపాధ్యాయులు పెరిగారు. క్వాలిఫైడ్‌ టీచ్చర్స్‌ ద్వారా విద్యాబోధన జరుగుతోంది. పాఠశాలలో మౌళిక వసతులు పెరిగాయి. టెక్నాలజీకి అనుగుణంగా తరగతి గదిలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రజాశక్తి: టీచ్చర్‌గా మీ అభిలాష ఎంటి?ఎంఈవో: నేను బోధనను ఎక్కువగా ఇష్టపడుతాను. నాకు చిన్నప్పటి నుంచి టీచ్చరంటే మక్కువ. మానాన్న హెచ్‌ఎం కావడం వల్ల స్వతాహగా ఉపాధ్యాయు వృత్తిపై గౌరవం ఎక్కువ. టీచ్చింగ్‌ అనేది నాకు ఫ్యాషన్‌, దానికి ఎక్కువుగా అడాప్ట్‌ అయ్యాను. ప్రజాశక్తి: పోటీ ప్రపంచంలో విద్యార్థులు మానసికస్థైర్యం ఎలా ఉంది.?ఎంఈవో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ తీవ్రంగా ఉంది. అందుకు తగ్గట్టుగా విద్యార్ధి దశ నుంచే అవగాహన అవసరం. కరోనా తర్వాత విద్యార్థులు మానసికస్థైర్యంపై ప్రభావం పడింది. వారిలో మానసిక ఉల్లాసాన్ని తీసుకొచ్చేందుకు సైకోథెరఫిస్టు అవసరం, కౌన్సిలింగ్‌ ద్వారా పిల్లల్లో ఖచ్చితంగా మార్పును తీసుకురావచ్చు. అందుకు తగ్గట్టుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని బావిస్తున్నాను. తల్లిదండ్రుల్లో కూడా ప్రోత్సాహం అవసరం. విద్యార్థుల ఎమోషన్స్‌ అర్ధం చేసుకుని, వాళ్లతో స్నేహపూర్వకంగా ఉంటూ మార్పు తీసుకొచ్చేందుకు వారు కూడా కృషి చేయాలి.రామకృష్ణయ్య, కస్తూరిబాయి దంపతులకు కార్వేటినగరం డేరాకండ్రిగలో కొల్లు బాలాజీ జన్మించారు. కార్వేటినగరం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యశించారు. బాలాజీ తొలిగురువు తండ్రి రామకృష్ణయ్యే. ఉన్నత చదువులు పూర్తి చేసియ 1989లో బుచ్చినాయుడు కండ్రిగలో జిఎస్‌టిగా ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. 1992లో స్కూల్‌ అసిస్టెంట్‌గా నాగలాపురానికి బదిలీ అయ్యారు. అక్కడ నుంచి పదోన్నతిపై 2005లో హెచ్‌ఎంగా కడప జిల్లాలో వై.కోటలో పని చేశారు. 2013లో బదిలీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా కందాడ, పల్లం ప్రాంతంలో పనిచేశారు. 2023 జూల్‌ 3వ తేది తిరుపతి ఎంఈవో-1గా బాధ్యతులు చేపట్టి. తిరుపతి ఎంఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 1993లో టీచ్‌ర్‌గా విధులు నిర్వహించే వైఎన్‌.మాధవితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, వారిద్దరు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.

➡️