స్విమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల చర్చలు సఫలం

స్విమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల చర్చలు సఫలం

స్విమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల చర్చలు సఫలంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌వేతనాలు పెంచాలని, హోదాలను మార్పు చేయాలని స్విమ్స్‌ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్‌ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి స్విమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో స్విమ్స్‌ యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షను స్విమ్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టారు. ఈ దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ వేతనాల పెంపు, హౌదాల మార్పు విషయంలో స్విమ్స్‌ యాజమాన్యం, టిటిడి తీవ్రంగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. స్వయంగా డైరెక్టర్‌ సమక్షంలో జరిగిన నిర్ణయాలు అమలు కాకపోతే ఎలా? అని ఆయన నిలదీశారు. రిపబ్లికన్‌ పార్టీ నేత పూతలపట్టు అంజయ్య కార్మికులకు మద్దతు ప్రకటించారు సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే. వేణుగోపాల్‌, జిల్లా నేతలు ఆర్‌ లక్ష్మి, బుజ్జి, వాసు స్విమ్స్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నేతలు రవి, సూరి, మారి ముత్తు తదితరులు ప్రసంగించారు. నిరాహార దీక్షలు చేపడుతున్న కార్మిక నాయకులను, సిఐటియు నేతలను స్విమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. కందారపు మురళి యూనియన్‌ నేతలు రవి, సూరి, మారి ముత్తు, సుబ్రహ్మణ్యం లతో డైరెక్టర్‌ ఆర్‌.వి. రవికుమార్‌, ఎంఎస్‌ డాక్టర్‌ రామ్‌, జిఎం జి. బాబు తదితరులు చర్చలు జరిపారు.తమ పరిధిలోని అన్ని రకాల సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో దీక్షలను కార్మికులు విరమించారు.

➡️