అంగన్వాడీల ఆర్తనాదాలు పట్టవా..?

అంగన్వాడీల ఆర్తనాదాలు పట్టవా..?

అంగన్వాడీల ఆర్తనాదాలు పట్టవా..?విజయవాడకు బయలుదేరిన కార్యకర్తలుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ అంగన్వాడీ చేస్తున్న పోరాటం ఆదివారం నాటికి 41వ రోజుకు చేరుకున్నది. గత 41 రోజులుగా అంగనవాడీ అక్క చెల్లెమ్మలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి వారి ఆర్తనాదాలు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. ఈసందర్భంగా సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధికంగా ఆడబిడ్డలు అలుపెరగకుండా పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవ్వుకుంటున్నాడని, నిన్ను చూసి జనం నవ్వుకునే రోజులు ఎంతో దూరంలో లేవని అతి తర్వరలోనే నిన్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చుని పరిస్థితి వస్తుందన్నారు. అంగన్వాడీలు నాగరాజమ్మ, జయప్రభ, సుజిత, రోజా యువరాణి, కల్పన, గీత, గోమతి, ఎల్లమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు గూడూరు టౌన్‌: పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారానికి 41 వ రోజులకీ చేరుకొంది. తిరుపతి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.హేమలత శిబిరం వద్దకు చేరుకొని సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. అనంతరం కామ్రేడ్‌ లెనిన్‌కు శత వర్ధంతి సందర్భంగా దీక్ష శిబిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళుర్పించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, గూడూరు పట్టణ సిఐటియు అధ్యక్షులు బివి.రమణయ్య, కార్యదర్శి ఎస్‌.సురేష్‌ పాల్గొన్నారు. సూళ్లూరుపేట: సూళ్లూరుపేటలో అంగన్వాడీల సమ్మె 41వ రోజుకు అంగన్వాడీ జిల్లా నాయకురాలు మేకల హైమావతి ఆధ్వర్యంలో చేరింది. ఈకార్యక్రమానికి సిఐటియు నాయకులు సమ్మెకు మద్దతు తెలియజేశారు. పుత్తూరు టౌన్‌: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ఆగవని అంగన్వాడీలు, సహాయకులు కలసి పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 41వ రోజు ఆదివారం ధర్నా నిర్వహించి ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, అంగన్వాడీలు మునికుమారి, విజయకుమారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తమ హక్కులను అడగడానికి కూడా ఈ రాష్ట్రప్రభుత్వం నిర్బంధం చేయడం దారుణమన్నారు. యూనియన్‌ నాయకులు, ధనమ్మ, రాధా, లలిత, మోహన్‌ లక్ష్మి, హైమావతి, అన్నపూర్ణ, కృష్ణవేణి, అరుణ పాల్గొన్నారు.అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు ఖండన తిరుపతి టౌన్‌: కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు.అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచి పెట్టాలని వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

➡️