అనంత రవితేజకు అరుదైన గౌరవం

అనంత రవితేజకు అరుదైన గౌరవం

అనంత రవితేజకు అరుదైన గౌరవం తిరుపతి టౌన్‌ : తిరుపతికి చెందిన అనంత రవితేజకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. విద్యారంగంలో అసాధారణమైన ప్రతిభ చూపే వ్యక్తులకు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఇబి 1 వీసాను అనంత రవితేజ అందుకున్నారు. తిరుపతి నలందానగర్‌లో నివాసం ఉంటున్న అనంత రమేష్‌నాయుడు, నీలిమల పెద్ద కుమారుడు రవితేజ. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లోని ఆపిల్‌ కంపెనీ హెడ్‌ క్వార్టర్స్‌లో ప్రిన్సిపాల్‌ రీసెర్చి సైంటిస్ట్‌ హోదాలో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఓ సైంటిస్ట్‌గా అసాధారణ ప్రతిభ చూపిన రవితేజను అమెరికా ప్రభుత్వం గౌరవ ప్రదంగా ఇబి 1 వీసాను మంజూరు చేసింది. ప్రఖ్యాత సైంటిస్ట్‌ ఐన్‌స్టీన్‌ ఈ వీసాపైనే అమెరికాలో అడుగుపెట్టారు.

➡️