ఆటో కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

ఆటో కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక… ప్రజాశక్తి-సూళ్లూరుపేట సూళ్లూరుపేట సిఐటియు ఆఫీసులో తడ మండల ఆటో కార్మికుల సంఘం ఏర్పాటయ్యింది. ఎస్‌.కె.రియాజ్‌ టౌన్‌ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించారు.తిరుపతి జిల్లా ఆటో కార్మిక అధ్యక్షులు బివి. రమణయ్య హాజరయ్యారు. అధ్యక్షులుగా కే.రాజా, ఉపాధ్యక్షులుగా ఏ. వెంకటేశ్వర్లు, కే.చంద్ర, ప్రధాన కార్యదర్శిగా కే.లక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా డి. వెంకటరమణయ్య,ఎం.రాజేష్‌, కోశాధికారిగా చంద్రాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరే కాకుండా ఐదు మంది ఆటో కార్మికులని కమిటీ సభ్యులుగా నిర్ణయించారు. నేతలు కే.సాంబశివయ్య, సుబ్బారావు,పి.మనోహర్‌ పాల్గొన్నారు.

➡️